నందిగామలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఆమె స్వామివారి రథాన్ని లాగారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో నందిగామ పురవీధులు భక్తజనసందోహంగా మారాయి.