నందిగామ మండలం అంబారుపేటలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న మూడు ఇసుక లారీలు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, దీనిపై ప్రత్యేక నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.