హోలీ పండుగ రోజున కొండూరు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నందిగామ పరిధిలోని మాగల్లు జడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న దినకరన్ అనే విద్యార్థి, తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మృతి చెందడంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మార్చురీ వద్ద తల్లి అనూష రోదనలు అందరినీ కలచివేశాయి.