నందిగామ వైసీపీ మండల సెక్రటరీ పెసరమెల్లి సురేశ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవికి స్వచ్ఛందంగా తానే రాజీనామా చేస్తున్నానని, పార్టీలో తనకు ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణకుమార్ సారధ్యంలో పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తానన్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్న పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.