చందర్లపాడు మండలం గుడిమెట్లలో కృష్ణా నదిలో స్నానానికి దిగిన వారికి శ్రీరాముడి పంచలోహ విగ్రహం లభించింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేయగా, పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే గ్రామంలో లక్ష్మీదేవి పంచలోహ విగ్రహం లభించినప్పుడు, గ్రామస్థులు దానిని అప్పటి సీఎం చంద్రబాబుకు అందించారు. తాజాగా రాముడి విగ్రహం దొరకడంతో గ్రామస్థుల్లో ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తోంది.