ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని రామిరెడ్డిపల్లి, జొన్నలగడ్డ, కొండూరు, మాగల్లు, పల్లగిరి గ్రామాల్లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం అయ్యాయి. వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పత్తి, మిర్చి, వరి పొలాల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.