నందిగామ బస్టాండ్లో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడంతో
విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీనికి తగినట్లుగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. తీవ్రమైన ఉక్కపోతతో పాటు బస్సులు రాకపోవడంతో నరకం చూస్తున్నామని, అధికారులు స్పందించి సమయానికి బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.