నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్య అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పెన్షన్ దారుని ఆప్యాయంగా పలకరించి, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను సేకరించారు. వృద్ధులు, విధవలు, వికలాంగులు, నిరుపేదలు వంటి వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.