నందిగామలో కిలో బంగారం, రూ. 6 లక్షల నగదు చోరీ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. కీసర టోల్ గేట్ సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు హైదరాబాద్, జడ్చర్ల మీదుగా గోవా వైపు వెళ్లినట్లు గుర్తించిన ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. కేసు ఛేదనకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.