ముసునూరు: పిడుగుపడి గొర్రెల కాపరి మృతి

351చూసినవారు
ముసునూరు: పిడుగుపడి గొర్రెల కాపరి మృతి
ముసునూరు మండలం చింతలవల్లి గ్రామ శివారు కొత్తూరులో మంగళవారం పిడుగుపాటుకు గురై ఏలి బాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ఎప్పటిలాగే గొర్రెలు, మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఏలి బాబు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్