నూజివీడులో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

997చూసినవారు
నూజివీడులో టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ లో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎమ్మెస్ నాగరాజు స్టడీ మెటీరియల్ ను వితరణగా అందించారు. గతంలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందించిన నాగరాజు, ఇప్పుడు టెన్త్ మెటీరియల్, క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్, స్వీట్స్ అందించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని హెచ్ఎం విజయ కుమారి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్