నూజివీడు మండలం యనమదల గ్రామానికి చెందిన వరికూటి రాజు (60) గత నెల 30వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆయన కుమారుడు విక్రమ్ రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విక్రమ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత నెల 30వ తేదీన రాజు తన ఇంటి నుంచి సైకిల్‌పై బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.