
పామర్రు: ప్రజలకు జవాబుదారీతనంగా ప్రభుత్వం పనిచేస్తుంది
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం తన నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తుందని తెలిపారు. మొత్తం 36 అర్జీలు స్వీకరించగా, వాటిలో 11 అర్జీలను తక్షణమే పరిష్కరించామని, మిగిలిన 25 అర్జీలను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కుమార్ రాజా హామీ ఇచ్చారు.



































