పమిడిముక్కల చేరుకున్న సీఎం చంద్రబాబు

3చూసినవారు
కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలం వీరంకిలాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే కార్యకర్తలు నినాదాలతో స్వాగతం పలికారు. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, ఎంపీ బాలశౌరి, స్థానిక ఎమ్మెల్యేలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. ఆతరవాత నైపుణ్య శిక్షణాభివృద్ది శాఖ జిల్లా అధికారులు నైపుణ్యం పోర్టల్, దాని ద్వారా ఉపాధి అవకాశాల కల్పనపై వివరించారు.

సంబంధిత పోస్ట్