పర్యావరణ పరిరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన “స్వచ్ఛ రథం” వాహనాన్ని బుధవారం మొవ్వ మండలం గూడపాడు గ్రామంలో పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా ప్రజలు రీసైకిల్ చేయగల ప్లాస్టిక్, ఐరన్ వంటి వస్తువులను ఇచ్చి నిత్యావసర సరుకులు పొందవచ్చని శాసనసభ్యులు కుమార్ రాజా తెలిపారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు నిత్యావసరాలు అందించే వినూత్న కార్యక్రమం.