కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామంలో గురువారం శ్రీ సిద్ధేంద్ర యోగి జయంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కూచిపూడి నాట్యానికి ఆరాధ్యుడైన సిద్ధేంద్ర యోగికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కళాకారులు, విద్యార్థులు గ్రామోత్సవం నిర్వహించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను అలరించేలా కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అందెల సవ్వడితో గ్రామం మారుమోగింది.