ఆదివారం పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు వారి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులందరికీ యూరియా, సాగునీరు సరఫరా చేసిందని, అకాల వర్షాల వల్ల ధాన్యం రంగు మారినా కొనుగోలు చేసి రైతు పక్షాన నిలబడి ఆదుకున్నట్లు తెలిపారు.