ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 1న పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (కమ్యూనిటీ హాల్) లో "జాబ్ మేళా" నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.