పామర్రు: ప్రజారోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం

1చూసినవారు
పామర్రు: ప్రజారోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం
పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేయూతనివ్వాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పి ఫోర్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఉండ్రపూడి గ్రామానికి చెందిన మండపాక కృష్ణమూర్తికి రూ. 71,491, తోట్లవల్లూరు మండలం పాముల లంక గ్రామానికి చెందిన చింతకుంట వెంకటరమణకు రూ. 23,400 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్