ప్రభువైన ఏసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. బుధవారం రాత్రి పామర్రు మండలం పసుమర్రు శివారు గంగుల చెరువు గ్రామంలో షేచేమ్ ప్రేయర్ హౌస్ నిర్వహించిన క్రీస్తు సువార్త సభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. లోకంలో ప్రేమ, కరుణతో జీవించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.