పామర్రు టౌన్ గఫార్ సెంటర్ చిన మసీదులో గురువారం ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, అల్లాహ్ దయతో ప్రతి ఇంటా సంతోషం, ఆయురారోగ్యాలు నిండాలని, సమాజంలో శాంతి, సోదరభావం వర్ధిల్లాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ముస్లిం సోదరీ సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.