గోపువానిపాలెం ఫ్లైఓవర్ వద్ద ప్రజలు నిత్య నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాల భయం వెంటాడుతోంది. నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.