పామర్రు: జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

10చూసినవారు
పామర్రు: జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే
తాడేపల్లిలో మంగళవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పామర్రు మాజీ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తుఫాన్ తో నష్టపోయిన రైతుల సమస్యలను, ధాన్యం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని ఆయన వివరించారు. పార్టీ తరఫున రైతుల పక్షాన నిలబడాలని మాజీ ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :