పామర్రు: కనుమూరు వద్ద రోడ్డు ప్రమాదం

9చూసినవారు
పామర్రు: కనుమూరు వద్ద రోడ్డు ప్రమాదం
శనివారం సాయంత్రం మచిలీపట్నం - పామర్రు జాతీయ రహదారిపై కనుమూరు సంధ్య ఆక్వా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి కారు ఆటోను ఢీకొట్టడంతో, ఆటో పంట బోదిలోకి వెళ్లింది. కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్నవారు వెంటనే స్పందించి, కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్