రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1వ తేదీన పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మండలంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అన్ని పనులను బుధవారం రాత్రి కల్లా పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.