పమిడిముక్కల: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

20చూసినవారు
పమిడిముక్కల: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి
మంగళవారం పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకులాకు వెళుతున్న ఆటో అదుపుతప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ దేశి నాగరాజు (50) అకస్మాత్తుగా అనారోగ్యంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్