కృష్ణాపురం శివారు ముసలనాయకపాలెం గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా అంతర్గత రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూటమి ప్రభుత్వం గుర్తించింది. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టింది. మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన సభలో, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.