మంగళవారం, పమిడిముక్కల మండలంలోని గోపువానిపాలెం గ్రామంలో 189 మంది రైతులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలలుగా రైతుల ప్రగతికి కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ. 20,000 నగదు జమ చేస్తున్నామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.