పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం శివారు ముదిరాజుపాలెంలో 2.5 కిలోమీటర్ల రోడ్డు గత 20 సంవత్సరాలుగా అద్వాన్నంగా మారింది. ఈ రోడ్డు సమస్య వల్ల వృద్ధులు, గర్భిణి స్త్రీలు, స్కూల్ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా రోడ్డు సమస్య పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న వచ్చిన మొంథా తుఫాన్ వల్ల ఉన్న రోడ్డు మరింత పాడైపోయిందని గురువారం తెలిపారు.