పెదపారుపూడి: మహేశ్వరపురంలో పేకాట స్థావరంపై దాడి..!

1చూసినవారు
పెదపారుపూడి: మహేశ్వరపురంలో పేకాట స్థావరంపై దాడి..!
పెదపారుపూడి మండల పరిధిలోని మహేశ్వరపురం డొంక రోడ్డులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 9,020 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుభాషిని తెలిపారు. మండలంలో మత్తు, మాదకద్రవ్యాల విక్రయం, వినియోగం, పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్స్ :