మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెదపారుపూడి ఎస్సై డి. సుభాషిని పిలుపునిచ్చారు. మంగళవారం వానపాముల గ్రామ మరియు వార్డు సచివాలయంలో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్‌లోని ‘శక్తి యాప్’ ఏ విధంగా రక్షణ కవచంలా పనిచేస్తుందో వివరించారు. ఈ కార్యక్రమం మహిళల భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా జరిగింది.