మంగళవారం చిన్నపారుపూడి గ్రామంలో గ్రామీణ రైతులకు ఉచిత పశు వైద్య సేవలు అందించేందుకు ఒక వైద్య శిబిరం నిర్వహించారు. పామర్రు మార్కెట్ యార్డ్ కమిటీ సహకారంతో ఈ మెగా శిబిరానికి అవసరమైన పశువుల మందులు అందజేశారు. ఉపసంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్ పశువులకు వైద్య సేవలు అందించగా, పామర్రు మార్కెట్ యార్డు చైర్మన్ శోభన్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా స్థానిక రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరింది.