గుడివాడ నుండి కంకిపాడు ఆర్&బి రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు పంపేందుకు పోస్ట్ కార్డుల ఉద్యమం గురువారం చేపట్టారు. భద్రతా దళం వ్యవస్థాపకులు మురళీకృష్ణ మాట్లాడుతూ.. పెదపారుపూడి నుండి వానపాముల వంతెన వరకు, అలాగే వెంట్రప్రగడ దాటిన తర్వాత కలవపాముల వరకు ఆర్&బి రోడ్డుకు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు పోస్టు కార్డుల ద్వారా తెలియపరుస్తామని అన్నారు.