కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలం, కపిలేశ్వరపురం శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం తరగతులను గ్రామపెద్ద కొల్లిపర రాధాకృష్ణ ప్రారంభించారు. గ్రంథాలయాధికారి
సాలార్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజాభివృద్ధికి పాటుపడాలని కొల్లిపర రాధాకృష్ణ సూచించారు. ఐనపూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాలు జీవితాలకు వెలుగునిచ్చే దీపాలని, విద్యార్థులకు గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు,
విద్యార్థులు పాల్గొన్నారు.