
బంటుమిల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
బంటుమిల్లిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి లక్ష్మీపురం సెంటర్ వద్ద ఎస్ఐ గణేశ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకే ఈ తనిఖీలు చేపడుతున్నామని, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్ఐ హెచ్చరించారు.





































