బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామంలో మొంధా తుఫాను కారణంగా డ్రైన్లు, పంట కాలవల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తుఫానుతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో ఆరా తీశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.