గూడూరు మండలం రామానుజ వత్తర్లపల్లిలో చెరువు తవ్వకాల సమయంలో పురాతన శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. దీంతో అధికారులు చెరువు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్కియాజికల్ సర్వే ఆఫ్
ఇండియా కు సమాచారం ఇచ్చినట్లు తహశీల్దార్ మంగళవారం తెలిపారు.