గూడూరు మండలం కంకటావ, కప్పలదొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు "స్ఫూర్తి" (ప్రేరణ) ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. పరీక్షల సమయంలో ఈ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని, దీనిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులు సూచించారు.