గూడూరు మండలం ముక్కొల్లు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జగన్నాథ స్వామివారి భూములలో గత రెండు రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు రైతులు దేవాదాయ శాఖకు చెందిన భూములను పూడ్చి మట్టి రోడ్లు నిర్మిస్తూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.