గూడూరు మండలం ముక్కొల్లు గ్రామంలో తమ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరంటూ రైతులు మంగళవారం అధికారులను నిలదీశారు. వారం రోజులుగా తమ పంట కొనుగోలుపై ఎటువంటి స్పందన రాకపోవడంతో రైతులు గ్రామంలోని ఆర్ఎస్కే కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంచులు ఇవ్వమని, ధాన్యం తీసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా అధికారులు స్పందించడం లేదని రైతులు ఆరోపించారు.