గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, మల్లవోలు, గూడూరు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఐదుగురు
విద్యార్థులు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి మండలానికి గర్వకారణంగా నిలిచారు. లక్ష్మి, మహిత, మోనిష, నాగమారుతి, పార్వతీలు ఈ సీట్లు సాధించినట్లు ఎంఈఓ తెలిపారు. విద్యార్థుల నిరంతర కృషి, ఉపాధ్యాయుల సరైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.