గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామం నుండి పెడనకు అక్రమ ఇసుక రవాణా యదేచ్చగా సాగుతోంది. శుక్రవారం రాత్రి ట్రాక్టర్లలో భారీ శబ్దాలతో పాటలు పెట్టుకుంటూ కాయకష్టం చేసి వచ్చిన ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ అక్రమ రవాణాకు సంబంధిత శాఖ అధికారుల అండదండలు ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.