గూడూరు: కంటైనర్ బైకు ఢీకొనడంతో యువకుడు మృతి

2చూసినవారు
గూడూరు: కంటైనర్ బైకు ఢీకొనడంతో యువకుడు మృతి
గూడూరు సుల్తానగరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సుల్తా నగరం నుంచి మచిలీపట్నంకు ముగ్గురు యువకులు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సుల్తా నగరంలో హైవేపై కంటైనర్ మలుపు తిరిగే సమయంలో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెడన గ్రామానికి చెందిన దేసు రోహిత్ మృతి చెందగా, చరణ్ తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం ఈ సంఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్