మచిలీపట్నం-కత్తిపూడి జాతీయ రహదారిపై బంటుమిల్లి సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెన్నమ్మ దిబ్బ గ్రామానికి చెందిన తమ్ము కిరణ్ కుమార్ (45) దుర్మరణం పాలయ్యారు. గుడ్లవల్లేరు నుంచి గ్రామానికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో మృతుడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.