కృత్తివెన్ను: కాపర్ దొంగల అరెస్ట్

3చూసినవారు
కృత్తివెన్ను మండలంలోని ఓఎన్జిసి ప్లాంట్లో కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చెరుకుమిల్లి గ్రామంలోని ఓఎన్జిసి యూనిట్ నుంచి కాపర్ వైర్లు మాయమవడంతో ఈ నెల 26న వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దొంగతనంలో ఓఎన్జిసిలో స్క్రాప్ తరలించే లారీ క్లీనర్ గా పనిచేస్తున్న వ్యక్తియే ప్రధాన సూత్రధారి అని తేలింది. ఈ సంఘటనతో ప్లాంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్