పెడన: స్టిక్కర్ తో విద్యార్థులకు గ్లాసుల పంపిణీపై విమర్శలు

10చూసినవారు
పెడన మండలం బల్లిపర్రు ప్రభుత్వ పాఠశాలలో జనసేన నాయకులు విద్యార్థులకు పార్టీ స్టిక్కర్ వేసిన గ్లాసులు పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. పాఠశాల ఆవరణలో రాజకీయ పార్టీలు, వాటి గుర్తులు, సింబల్స్ ఉపయోగించకూడదనే విద్యాశాఖ ఆదేశాలను విస్మరించారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ నాయకులు ఈ ఆదేశాలను బేఖాతరు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్