పెడన పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం రాత్రి కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఉన్న చెత్త డబ్బా నిండిపోయి, కిందపడిన చెత్తలో మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి, వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయి ఉంటే భారీ నష్టం జరిగేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.