పెడన పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. సోమవారం, పట్టణంలోని 7వ వార్డులో రూ. 20 లక్షల అంచనాతో నిర్మించనున్న డ్రైన్ నిర్మాణానికి కూటమి నాయకులతో కలిసి ఆయన శంఖుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.