ముంధా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4వ తేదీన పెడన నియోజకవర్గంలోని తరకటూరు నుండి రామరాజుపాలెం వరకు తుఫాన్ వల్ల నష్టపోయిన పొలాలను పరిశీలించనున్నారు. రైతుల కష్టసుఖాలు తెలుసుకుని వారి బాధలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము ఆదివారం తెలిపారు.