పెడన: రేపు పెడనలో మెగా జాబ్ మేళా

2570చూసినవారు
పెడన: రేపు పెడనలో మెగా జాబ్ మేళా
ఈ నెల 30న పెడనలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్